శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 మార్చి 2017 (11:11 IST)

కర్నూలులో నిర్భయ ఘటన.. నిద్రిస్తున్న మహిళపై గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ భాగంలో కర్రను చెక్కి?

నిర్భయ లాంటి ఘటనలు ఎన్ని జరిగినా... మహిళల రక్షణ కోసం కఠినమైన చట్ట సవరణకు కేంద్రం మొగ్గుచూపట్లేదు. తాజాగా నిద్రపోతున్న ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.

నిర్భయ లాంటి ఘటనలు ఎన్ని జరిగినా... మహిళల రక్షణ కోసం కఠినమైన చట్ట సవరణకు కేంద్రం మొగ్గుచూపట్లేదు. తాజాగా నిద్రపోతున్న ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా ఆలహర్విలో నిద్రిస్తున్న ఓ వివాహితపై దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిద్రిస్తున్న ఓ వివాహిత నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి.. దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీలో నిర్భయ తరహాలో జరిగిన ఈ దాడితో, బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. లైంగిక దాడికి అనంతరం.. ఆమెను ఆమె ఇంటి ముందు పారేసి దుండగులు పారిపోయారు. 
 
ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. మానభంగం చేసిన తర్వాత, ఆమె ప్రైవేట్ భాగంలో కర్రను కూడా చెక్కి వెళ్లినట్లు సమాచారం. అప్పుల వ్యవహారంతోనే వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.