మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (20:21 IST)

విశాఖకు నిర్మలా సీతారామన్: స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయొద్దని..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కార్మికులు యత్నించారు. ఇక ఎయిర్‌ పోర్టులో ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలు, నిర్వాసితులను అరెస్ట్‌ చేసి తరలించారు పోలీసులు. 
 
శనివారం  పొందూరు పర్యటనలో భాగంగా జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్నారు నిర్మల సీతారామన్‌. రేపు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరు వెళతారు. అక్కడ మధ్యాహ్నం భోజనాలు ముగిశాక 3 గంటలకు బయలుదేరి విశాఖపట్నం వస్తారు. ఇక్కడి నుంచి సాయంత్రం 5.55 గంటలకు ఢిల్లీ వెళతారు.  
 
స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయొద్దని కార్మికుల డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. నిర్మలా సీతారామన్ నేడు పోర్ట్ గెస్ట్ హౌస్‌ విశ్రాంతి తీసుకుంటారు.