శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 25 ఆగస్టు 2021 (12:40 IST)

ఐ.ఎ.ఎస్. కావాల‌ని త‌ప‌న‌... కాలేక‌ విరక్తితో ఆత్మహత్య!

ఐఏఎస్‌ కావాలన్నది ఆయన జీవితాశయం. వయసు పెరిగిపోతుండటం. లక్ష్యం అందినట్టే అంది దూరమవుతుండటంతో జీవితంపై ఆశ చంపేసుకున్నారు. చివరికి బలవన్మరణానికి పాల్పడ్డారు.  
 
నిజామాబాద్‌లోని వివేకానందనగర్‌ కాలనీ వాసి శ్రీనివాస్‌(42) పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఐఏఎస్‌ కావాలనే ఆశయంతో ఏళ్ల తరబడి దిల్లీలో ఉండి శిక్షణ తీసుకున్నారు. రెండుసార్లు ఇంట‌ర్వ్యూ వరకు వెళ్లినా ఫలితం లేకపోయింది.
 
ఇటీవల ఆయ‌న బంధువుల్లో ఒకరికి ఐఏఎస్‌ రావడంతో శ్రీనివాస్ మరింత కుంగిపోయారు. ఇదే కారణంతో గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించడంతో బతికి బయటపడ్డారు. ఈసారి ఆయ‌న తీవ్ర విర‌క్తితో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో నిజామాబాద్‌ నాలుగో ఠాణా పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.