సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (19:07 IST)

ట్రోలింగ్‌తో నా కుమార్తెలు కన్నీళ్లు పెట్టుకున్నారు.. పవన్ కామెంట్స్ వైరల్

Pawan kalyan_Anitha
Pawan kalyan_Anitha
వైసీపీ అనుబంధ ఖాతాల ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుమార్తెలపై అనేక అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ట్రోలింగ్‌తో తన కుమార్తెలు కన్నీళ్లు పెట్టుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ట్రోలింగ్, బూటకపు ప్రచారంపై ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోనుందన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలపై ఇటీవల జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కూడా సానుకూలంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. రాష్ట్ర సచివాలయంలో భేటీ కావడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
 
రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మర్యాదపూర్వకంగా సమావేశం కావడం జరిగిందని హోం మంత్రి అనిత ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు.. వాటిపై హోంశాఖ తీసుకుంటున్న చర్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, ఇతర అఘాయిత్యాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు వెల్లడించారు. ఇక పవన్ తన కుమార్తెలు ట్రోలింగ్‌పై ఆవేదనకు గురైన విషయాన్ని వెల్లడించడంపై ఆయన ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. ట్రోలర్లపై ఫైర్ అవుతున్నారు.