1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 27 జనవరి 2017 (12:48 IST)

బాబూ... యువతను అడ్డగిస్తే పరిణామాలు తీవ్రం... తెలంగాణ తీసుకెళ్లారు తెలుసుగా... పవన్ కళ్యాణ్

ఇచ్చిన హామీని నెరవేర్చకుండా అర్థంకాని మాటలు చెప్పడం ప్రభుత్వాలకు అలవాటేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఐతే తమ హక్కులను కాలరాస్తూ, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే యువత చూస్తూ కూర్చోరని హెచ్చరించారు. తెలంగాణలో అన్యాయం జరిగిందని విశ్వసించబట్టే యువత మొ

ఇచ్చిన హామీని నెరవేర్చకుండా అర్థంకాని మాటలు చెప్పడం ప్రభుత్వాలకు అలవాటేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఐతే తమ హక్కులను కాలరాస్తూ, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే యువత చూస్తూ కూర్చోరని హెచ్చరించారు. తెలంగాణలో అన్యాయం జరిగిందని విశ్వసించబట్టే యువత మొత్తం రోడ్లపైకి వచ్చి ఏపీ నుంచి తెలంగాణను తీసుకెళ్లిన సంగతి ప్రభుత్వాలకు తెలియవా అని ప్రశ్నించారు. యువత శాంతియుత ఉద్యమాన్ని అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు.
 
తెదేపా, భాజపాల తీరుపై మండిపడ్డ పవన్ కళ్యాణ్ ఆ రెండు పార్టీల వైఖరిని తూర్పారబట్టారు. తమిళనాడులో సంప్రదాయ క్రీడతో భాజపా ఆటలాడుకున్నదనీ, తమతో ఆడుకుంటే పరిణామం ఎలా వుంటుందో తమిళ యువత భాజపాకు చూపించిందని అన్నారు. ఇప్పటికైనా బీజేపి బుద్ధి తెచ్చుకుని ప్రత్యేక హోదా ఇచ్చి తన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు.
 
ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా తను రోడ్డెక్కుతాననీ, బయటకు వస్తానని చెప్పారు. నిన్న జరిగిన నిరసనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లయితే బావుండేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడుగారికి పాలనానుభవం వున్నదనే గత ఎన్నికల్లో మద్దతు తెలిపినట్లు చెప్పారు.