బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (08:12 IST)

పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవ సభ నేడే... కాకినాడలో భారీ ఏర్పాట్లు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ' పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం మూడంచెల కార్యాచరణ ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌ అందులో భాగంగా తొలి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ' పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం మూడంచెల కార్యాచరణ ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌ అందులో భాగంగా తొలి సమావేశాన్ని కాకినాడలో నిర్వహించనున్న విషయం తెల్సిందే. 
 
స్థానిక జేఎన్‌టీయూ క్రీడా మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించేందుకు అనుమతి కోరినట్లు కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మైదానం సామర్థ్యం 75,000 వరకు ఉంటుందని అనుమతి లేఖలో నిర్వాహకులు పేర్కొన్నట్లు చెప్పారు. 11.6 ఎకరాల విస్తీర్ణం ఉన్న మైదానంలో సభా ఏర్పాట్లు భారీగానే చేశారు. 
 
ఈ సభలో పాల్గొనేందుకు ఇతర రాజకీయ నేతల కంటే భిన్నంగా సభ జరుగనున్న ప్రాంతానికి ఒక రోజు ముందుగానే పవన్ కళ్యాణ్ కాకినాడుకు చేరుకున్నారు. దీంతో ఆయన బస చేసిన హోటల్ వద్ద ఆయన అభిమానులు భారీగా చేరిపోయారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను కఠితరనం చేసి పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
 
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభ నేపథ్యంలో అప్పుడే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి. గురువారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని నలుమూలల నుంచి పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో కాకినాడకు తరలివచ్చారు. నేటి ఉదయం తెల్లవారకముందే పెద్ద సంఖ్యలో అభిమానులు పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ జనసందోహం నెలకొంది.