శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Updated : గురువారం, 30 జులై 2020 (16:43 IST)

నూతన విద్యా విధానానికి స్వాగతం పలికిన పవన్ కల్యాణ్

నూతన విద్యా విధానానికి స్వాగతం పలికారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదని తెలిపారు. మాతృ భాషలో బోధన జరిగినప్పుడు గొప్ప ఫలితాలు ఆవిష్కృతమవుతాయని యునెస్కో 2008లో ప్రకటించిందని తెలిపారు.
 
ఇటీవల ఏపీ సర్కారు ఇంగ్లీషు మీడియంపై నిర్ణయం తీసుకున్నప్పుడు జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే జనసేన ఇంగ్లీష్ మీడియం బోధనకు ఏమాత్రం వ్యతిరేకం కాదని ఏపీలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేసినప్పుడు మాత్రమే వ్యతిరేకించామని పేర్కొన్నారు. తమ పిల్లలు ఏ భాషలో చదవాలన్న విషయాన్నితల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయాలని, ఇంగ్లీష్ మీడియం ఒక ఆప్షనల్‌గా మాత్రమే ఉండాలన్నది జనసేన పార్టీ అభిప్రాయమన్నారు.
 
తాజా ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో జరగాలని నిర్ణయించిన సభ్యులకు, కమిటీ సిఫారుసులను ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు.