మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (22:03 IST)

నైపుణ్య శిక్షణ, ముద్రపై ప్రధాని సమీక్ష... కాన్ఫరెన్సులో ఏపీ సీఎస్

అమరావతి: ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకెవివై), ప్రధాన మంత్రి ముద్ర(మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏ

అమరావతి: ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకెవివై), ప్రధాన మంత్రి ముద్ర(మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన(పీఎంఎంవై) పథకాలను సమీక్షించారు. సచివాలయం ఒకటవ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరం నుంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 
 
నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్(ఎన్ఎస్ డీసీ) ద్వారా 75 శాతం పీఎంకెవివై నిధులు వినియోగించి యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించినట్లు  అధికారులు ప్రధానికి వివరించారు. మొత్తం వ్యయంలో రాష్ట్రాలు 25 శాతం నిధులు భరిస్తాయని చెప్పారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సుల వివరాలు, పరిశ్రమలు, ప్రైవేటు రంగ భాగస్వామ్య గురించి తెలిపారు. 33 భాగస్వామ్య పరిశ్రమలు రూ.100 కోట్లు సహాయం అందించినట్లు చెప్పారు. 
 
ఈ పథకం ద్వారా శిక్షణ పొంది ఉపాధి పొందినవారి వివరాలు తెలిపారు. ముద్ర పథకం ద్వారా రుణాలు తీసుకున్న, చెల్లించినవారి వివరాలు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సాంఘిక సంక్షేమ శాఖ  ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.