బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 12 ఆగస్టు 2020 (22:39 IST)

ఎపిలో ఇళ్ళపట్టాల పంపిణీ వాయిదా, మళ్ళీ ఎప్పుడంటే?

నిరుపేదలు సొంతింటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలను ప్రభుత్వం గుర్తించింది. ఒక లిస్టును తయారుచేసింది. అర్హులైన వారందరికీ స్థలాలను సిద్ధం చేసింది. మొత్తం స్థలాలను సిద్థం చేశారు.
 
స్థలాల పంపిణీ ఎప్పుడో జరగాల్సింది. కానీ కరోనా సమయమంటూ వాయిదా వేస్తూ వస్తోంది ప్రభుత్వం. అసలే కరోనా సమయంలో బతకడమే కష్టమనుకున్న సమయంలో ఇంటి అద్దెలు కట్టడం ఎంతో కష్టంగా మారుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలాలతోనైనా నెట్టుకొద్దామని నిరుపేదలు భావించారు.
 
కానీ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇప్పట్లో ఇచ్చేట్లు కనిపించడం లేదు. ఆగష్టు 15వ తేదీ ఇళ్ళస్థలాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో నిరుపేదలందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు కానీ ఆ పంపిణీని మళ్ళీ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈనెల 15వ తేదీన ఇళ్ళ వాయిదా జరగడం లేదని డిప్యూటీ సిఎం ధర్మాన క్రిష్ణప్రసాద్ తెలిపారు.
 
మళ్ళీ పంపిణీ అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ఇళ్ళపట్టాల పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఉపముఖ్యమంత్రి ప్రకటనతో ప్రజల్లో నిరాశ ఆవహిస్తోంది. ఈ రోజు రేపు అంటూ ప్రభుత్వం నిరుపేదలతో ఆడుకుంటోందని ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి.