శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (11:05 IST)

తెలుగునాట రాజన్న రాజ్యం... అక్షర సత్యమైన బ్రహ్మంగారి కాలజ్ఞానం

బ్రహ్మంగారి కాలజ్ఞానం అక్షర సత్యమైంది. తెలుగునాట రాజన్నరాజ్యం వస్తుందంటూ నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇపుడు నిజమైంది. తెలుగునాట చంద్రదోషం పోయింది. రాజన్నరాజ్యం వచ్చిందింటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అద్భుతమైన విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
అయితే, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ పోస్టు ఏంటంటే.. తెలుగు కాలజ్ఞానిగా పేరున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, భవిష్యత్తు గురించి 400 సంవత్సరాల క్రితం చెబుతూ, ఇప్పటి రాజకీయ పరిస్థితులను ప్రస్తావించారట. అందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన తన కాలజ్ఞానంలో వికారి, చంద్రదోషం, రాజన్నరాజ్యం వంటి పదాలను ఆనాడే వాడారు. 
 
"ధరణిలో వికారి సంవత్సరంబున
తెలుగు రాష్ట్రమున మార్పులొచ్చేనయ!
చంద్రదోషము నాడు వీడేనయ!
రాజన్న రాజ్యంబు వచ్చేనయ!
తప్పదు నా మాట నమ్మండయ!!"
 
అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని వాక్యాలతో కూడిన పోస్టర్ ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.