శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 23 మే 2019 (21:27 IST)

నాడు ఎన్టీఆర్ - నేడు జగన్: తెదేపా నేతలకు దిమ్మతిరిగే షాక్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెదేపా నాయకులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా బిగ్ షాట్స్ ఫ్యామీల‌కు కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. ఇంత‌కీ ఆ ఫ్యామిలీస్ ఎవ‌రెవ‌రంటే... పరిటాల ఫ్యామిలీకి ఇది తొలి ఓటమి. రాప్తాడులో ఓటమి బాటలో పరిటాల శ్రీరాం ఉన్నారు. అలాగే తొలిసారి ఓటమి రుచి చూస్తోన్న జేసీ ఫ్యామిలీ. 
 
ఓటమి బాటలో అనంత లోక్‌సభ అభ్యర్థి జేసీ పవన్, తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థి జేసీ అస్మిత్. తొలిసారి ఓటమి పాలైన దేవినేని ఉమ. 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తోన్న దేవినేని ఉమ ఈసారి ఓట‌మి పాల‌య్యారు. ప్రాతినిధ్యాన్ని కోల్పోయిన కేఈ ఫ్యామిలీ. ధూళిపాళ్ల నరేంద్రకు డబుల్ హ్యట్రిక్ మిస్ అయ్యింది. ఓటమి బాటలో ధూళిపాళ నరేంద్ర వున్నారు. 
 
ఓటమి బాటలో మంత్రి అమర్ నాధ్ రెడ్డి. 1996 ఉప ఎన్నిక నుంచి ఇప్పటివరకూ ఓడిపోని మంత్రి అమర్‌నాథ్ రెడ్డి ఈసారి 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు కుదేలయ్యారు. ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి చూడాల్సి వ‌స్తుంది. 
 
అలాగే ఓటమి దిశగా కోడెల శివ‌ప్ర‌సాద్. పట్టుపట్టి సీటు తెచ్చుకున్నా కోడేల గెలవలేకపోతోన్నారు. మొత్తంగా చూసుకుంటే... జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం మామూలుగా లేదు. నాడు ఎన్టీఆర్ - నేడు వై.ఎస్.జ‌గ‌న్..! అంతే.