ఫ్యాన్ గాలికి కొట్టుకునిపోయిన 15 మంది మంత్రులు

Last Updated: గురువారం, 23 మే 2019 (17:15 IST)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైకాపా విజయభేరీ మోగించింది. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాలాల్లో వైకాపా ఏకంగా 148 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో 48 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. అలాగే, టీడీపీ మాత్రం 26 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, వీటిలో 6 ఆరు సీట్లలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

శాసనసభ ఎన్నికల్లో ఫ్యాన్ సృష్టించిన సునామీ దెబ్బకు తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి. నారాయణతో పాటు.. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. అయితే, ఏపీ హోం మంత్రిగా పని చేసిన చిన్నరాజప్ప మాత్రం ఫ్యాను వీసిన స్పీడ్ గాలిని తట్టుకుని గెలుపొందారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా ఓడిపోయారు. ఈయన మంగళగిరి నుంచి పోటీచేశారు.

అలాగే, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లిలో ఓటమిపాలయ్యారు. మంత్రి పి. నారాయణ నెల్లూరు సిటీ స్థానం నుంచి పోటీ ఓటమిచెందారు.దీనిపై మరింత చదవండి :