శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 23 మే 2019 (14:40 IST)

తిరుపతిలో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్ జగన్..

ఏపీలోని ఎన్నికల ఫలితాలు అంతా ఏకపక్షమే అయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తుండటంతో టీడీపీ, జనసేన చతికిలపడిపోయాయి. ఫ్యాన్ గాలిని తట్టుకోలేక సైకిల్ పంక్చర్ కాగా.. గ్లాసు పగిలిపోయింది. వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం అవడంతో వైఎస్ జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులకు పండగ వాతావరణం నెలకొని ఉంది.
 
ఇదే ఊపులో ప్రభుత్వం ఏర్పాటు దిశగా వైఎస్సార్సీపీ నేతలు చకచకా అడుగులు వేస్తున్నారు. ఈనెల 30వ తేదీన వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు.