శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 23 మే 2019 (15:15 IST)

బాలకృష్ణ ఒక్కడు తప్పితే.. అన్నీ స్థానాల్లోనూ వైకాపాదే ఆధిక్యం..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ సీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో కూడా వైఎస్సార్ సీపీ దూకుడు చూపిస్తోంది.


జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గానూ 13 స్థానాల్లో వైఎస్సార్ సీపీ ఆధిక్యంలో ఉంది. ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే డిసైడింగ్ ఫ్యాక్టర్‌లలో ఒకటిగా నిలిచిన అనంతపురం జిల్లాలో టీడీపీకి ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
 
వైఎస్సార్ సీపీ ఆధిక్యంలో ఉన్న స్థానాలు..
మడకశిర(ఎస్సీ)లో 5వేల 60 ఓట్లు 
సింగనమల (ఎస్సీ)లో 11 వేల 334 ఓట్లు 
కళ్యాణదుర్గంలో 9 వేల 377 ఓట్లు 
 
ఉరవకొండలో 4 వేల 288 ఓట్లు 
రాప్తాడులో 10 వేల 417 ఓట్లు 
పెనుకొండలో 10వేల 68 ఓట్లు 
తాడిపత్రిలో 5వేల 253 ఓట్లు 
 
గుంతకల్లులో 13 వేల 761 ఓట్లు, 
రాయదుర్గంలో 13 వేల 207 ఓట్లు 
పుట్టపర్తి 10 వేల 859 ఓట్లు 
ధర్మవరం 11 వేల 123ఓట్లు 
 
కదిరిలో 13 వేల 436 ఓట్ల, 
అనంతపురం అర్బన్ లో 14 వేల 445 ఓట్లు 
టీడీపీ.. ఆధిక్యం..
హిందూపురంలో 5 వేల 66 ఓట్లు