బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 12 జులై 2021 (16:17 IST)

చాటుగా విద్యుదుత్ప‌త్తి, పోలీసు వ‌ల‌యంలో పులిచింత‌ల

ఆంధ్ర‌, తెలంగాణా మ‌ధ్య జ‌ల వివాదాన్ని రాజేసిన పులించిత‌ల ప్రాజెక్ట్ ఇపుడు పోలీసు వ‌ల‌యంలో ఉంది. పులిచింత‌ల ప్రాజెక్ట్ ను సంద‌ర్శించ‌బోయిన వారిని తెలంగాణా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ విప్ సామినేని ఉదయభానుని తెలంగాణ సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. 
 
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుని తెలంగాణ రాష్ట్రం సరిహద్దు బుగ్గమాధారం వ‌ద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంద‌ని, అందుక‌నే త‌మ‌ని అడ్డుక‌న్నార‌ని ఏపీ ప్రభుత్వ విప్ ఉదయభాను ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు సందర్శించడానికి వచ్చిన మమ్మల్ని తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం దారుణమ‌న్నారు. అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి ఇదే విధంగా కొనసాగిస్తే చూస్తూ ఊరుకోం అన్నారు. ఉద‌యభాను వెంట తన్నీరు నాగేశ్వరరావు, అంగడాల పూర్ణ భారీ  సంఖ్యలో కార్యకర్తలున్నారు.