శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (16:39 IST)

ప్రియుడికి పెళ్ళైపోయింది.. ప్రేయసి నెయిల్ పాలిష్ రిమూవర్ తాగేసింది.. కొత్త పెళ్ళికొడుకు జంప్

ఓ యువకుడు తనను ప్రేమించి వేరొక యువతిని పెళ్ళి చేసుకున్నాడనే మనస్తాపంతో అతని మాజీ ప్రేయసి నెయిల్ పాలిష్ రిమూవర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వేరొక అమ్మాయిని పెళ్ళాడిన ప్రియుడు పారిపోయాడు. ఈ ఘటన ప

ఓ యువకుడు తనను ప్రేమించి వేరొక యువతిని పెళ్ళి చేసుకున్నాడనే మనస్తాపంతో అతని మాజీ ప్రేయసి నెయిల్ పాలిష్ రిమూవర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వేరొక అమ్మాయిని పెళ్ళాడిన ప్రియుడు పారిపోయాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా మణికేశ్వరానికి చెందిన కరిముల్లా అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే ఈ వీరి ప్రేమ 2014లోనే బ్రేకప్ అయ్యింది. 
 
ఏడాది పాటు ఉద్యోగం కోసం చెన్నై వెళ్ళిన తన ప్రియురాలు వేరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కరిముల్లా ఆమెకు దూరమయ్యాడు. అంతేగాకుండా కరిముల్లా పెద్దలు నిశ్చయించిన అమ్మాయిని 17వ తేదీ ఉదయం పెళ్ళి చేసుకున్నాడు. అయితే పెళ్ళికి ముందే కరిముల్లా ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో తన ప్రియుడికి వేరొక యువతితో వివాహం జరిగిన విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. 
 
నెయిల్ పాలిష్ రిమూవర్ తాగేయడంతో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇంతలో కరిముల్లా గ్రామం నుంచి పారిపోయాడని.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.