శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2016 (10:29 IST)

సవతి తల్లి దాష్టీకం.. నాలుగేళ్ల చిన్నారికి వాతలు పెట్టిన వైనం.. తీవ్ర రక్తస్రావం కావడంతో?

సవతి తల్లి పోరు ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నపిల్లాడని కూడా చూడకుండా ఒంటి నిండా వాతలు పెట్టి తన సవతి బుద్ధిని ప్రదర్శించింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా దర్శిలో నాలుగేళ్ల బ్రహ్మయ్య అన

సవతి తల్లి పోరు ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నపిల్లాడని కూడా చూడకుండా ఒంటి నిండా వాతలు పెట్టి తన సవతి బుద్ధిని ప్రదర్శించింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా దర్శిలో నాలుగేళ్ల బ్రహ్మయ్య అనే బాలుడిపై ఈ దాష్టికం జరిగింది. బ్రహ్మయ్య తండ్రి ఆంజనేయులు వద్ద ఉంటున్నాడు. ఆంజనేయులు రెండో భార్య లక్ష్మీకి తొలి భార్య కుమారుడు. కానీ బ్రహ్మయ్య తమతో ఉండేది ఇష్టం ఉండేది కాదు. 
 
దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారిని చితబాదింది. ఆపై ఓ గదిలో బంధించింది. ఆమె కొట్టిన దెబ్బలకు బ్రహ్మయ్యకు తల నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకున్న ఆ బాలుడు రోడ్డు పైకి రావడంతో స్థానికులు ఆ బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సవతి తల్లి లక్ష్మీ. తండ్రి ఆంజనేయులు కోసం గాలిస్తున్నారు.