శుక్రవారం, 21 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 మార్చి 2025 (20:15 IST)

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

rrr - duryodhana
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే, మాజీ లోక్‌సభ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దుర్యోధనుడు వేషంలో అదరగొట్టారు. ఆయన దుర్యోధనుడు ఏకపాత్రాభినయం చేసి ఆలరించాడు. ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 
 
విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సభాపతి అయ్యన్నపాత్రుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, మంత్రి లోకేశ్‍‌తో పాటు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 
 
అసెంబ్లీలో ఆటల పోటీలతో పాటు చివరి రోజు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. కళాభిమాని ఆయన రఘురామరాజు తాను వేసిన వేషంతోనే వచ్చి సీఎం, డిప్యూటీ సీఎంలతో ఫోటోలు దిగారు.