శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:24 IST)

శ్రీవారి సన్నిధిలో ఎంపీ మార్గాని భరత్ రామ్ దంపతులు

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం గాలిగోపురం వ‌ద్ద మీడియా ఎంపీ మార్గాని భ‌ర‌త్ ని ప‌ల‌క‌రించింది.

తాను వెంక‌టేశ్వ‌రుడి భ‌క్తుడిని అని, అందుకే, కుటుంబ స‌మేతంగా స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చాన‌ని భ‌ర‌త్ తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌జ‌లంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని కోరుకున్న‌ట్లు ఎంపీ చెప్పారు. రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ తో పాటు శ్రీవారిని దర్శించుకున్న వారిలో  వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతం, నాయకులు భాస్కర్ తదితరులు ఉన్నారు.