శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 13 జూన్ 2017 (16:49 IST)

19 నుంచి రంజాన్ కానుక... 12 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా... మంత్రి పుల్లారావు

ఈ నెల 19 నుంచి25 వరకు రాష్ట్రంలో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకను పంపిణి చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 లక్షలమంది ముస్లిం కుటుం

ఈ నెల 19 నుంచి25 వరకు రాష్ట్రంలో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకను పంపిణి చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 లక్షలమంది ముస్లిం  కుటుంబాలకు  65.69 కోట్ల  రూపాయల విలువైన రంజాన్ కిట్లను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ముస్లిం సోదరుల ఇంటికీ 5 కేజీల గోధుమపిండి, 2కేజీల పంచదార, కేజీ సేమియా, వంద గ్రాముల నెయ్యి ఉన్న సంచిని అందిస్తున్నామని మంత్రి తెలిపారు. 
 
తోఫాకు 65.69 కోట్ల రూపాయల విలువైన సరకులను రూ.38.69 కోట్లకు సరఫరా చెయ్యడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారన్నారు. తక్కువకు కోట్ చేసిన సరుకుల్లో నాణ్యతలోపిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నాసి రకం సరకులు సరఫరా చేస్తే వారిని బ్లాక్ లిస్టులో పెట్టి... బయట మార్కెట్లో నాణ్యవంతమైన సరకులు కొని ఆ సొమ్ము పంపిణీదారులు నుంచి వసూలు చేస్తామని స్పస్టం చేశారు. ఎమ్మెఎల్ ఎస్ పాయింట్ నుండి డీలర్లు దగ్గరుండి ఎలక్ట్రానిక్ తూకాల ద్వారా సరకులను తెచ్చుకోవాలన్నారు. తూనికల్లో ఎలాంటి తేడాలు వచ్చినా డీలర్లు వాటిని తీసుకోకుండా అధికారులకు ఫిర్యాదు చెయ్యాలని చెప్పారు. 
 
కార్డు దారులు కూడా తూనికల్లోతక్కువగా డీలర్లు పంపిణీ చేస్తే 1100నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అలాంటి ఫిర్యాదు అధికారులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో 38.92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో 43లక్షల టన్నులు , ఈ ఏడాది రబి సీజన్లో ఈ ఏడాది 15,60,293 టన్నుల ధాన్యం సేకరించామని, గత ఏడాది 20 లక్షల టన్నులు సేకరించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులు రైతులు ఖాతాలో ఇప్పటికే చెల్లించామన్నారు. 
 
ప్రస్తుతం రూ. 76కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. మిల్లర్లు ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యం పంపిణి చేయకుండా అక్రామాలకు పాల్పడితే  రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అరెస్టు చేయిస్తామన్నారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీ 40 రూపాయల కన్నాఎక్కువ ధరలకు బియ్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ఎమ్మార్ఫీ ధరలకంటే 25 శాతం తక్కువ ధరలకే అన్ని నిత్యావసర సరకులు పంపిణి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. 
 
ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయనేది కేవలం వదంతులు మాత్రమేనని ఎక్కడైనా  ప్లాస్టిక్ బియ్యం మార్కెటింగ్ చేస్తున్నారని ఎవరైనా నిరూపించగలిగితే 50 వేల రూపాయల నగదు బహుమతిని అందిస్తామని మంత్రి తెలిపారు.   వివిధ రాకాల నిత్యవసర వస్తువులను సూపర్ మార్కెట్లు, పెద్ద పెద్ద స్టోర్ల ద్వారా ఎమ్ ఆర్ పీ ధరలకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాము .ఇప్పటికే రాజస్థాన్ లో విజయవంతమైన ఈ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు ఆసక్కి గల సంస్థలనుండి ఇఓఐ(ఆసక్తి నపరుచుట) టెండర్ల ధరకాస్తులు కోరనున్నట్లు మంత్రి తెలిపారు. బహిరంగ మార్కెట్లో వ్యాపారులు ఎవరైనా ఎమ్మార్ఫీ ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయింస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.
 
పౌరసరఫరాల సంస్థ అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం  పథకం,అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరాచేసే డీలర్లకు కమిషన్ల బకాయిలున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.  రెవెన్యే అధికారులు  రికార్డులు పరిశీలించి త్వరలో ఈ బకాయిలను కూడా చెల్లిస్తామని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తే గోదాములు నిర్మించటానికి సిద్ధంగా ఉన్నామని, ఇందుకు నిధుల కొరత లేదని కార్పొరేషన్ అధ్యక్షులు లింగారెడ్డి తెలిపారు.