శనివారం, 1 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By DV
Last Modified: సోమవారం, 12 సెప్టెంబరు 2016 (20:30 IST)

రంజిత భక్తి పాఠాలు చెప్పాలనుకుంటోంది... ఎవరికి, ఎలాగ...?

రంజిత... ఈపేరు విని చాలా రోజులైంది. కర్నాటకు చెందిన నిత్యానంద స్వామితో రాసలీలలు బయటకు వచ్చాక.. ఆమె పేరు బాగా పాపులర్‌ అయింది. ఆ తర్వాత స్వామిపై కేసులు వేయడం.. కోర్టు కేసు నుంచి బయటపడటం జరిగింది. బెంగుళూరు శివారల్లో విశాలమైన ఆశ్రమంలో నిత్యానంద.. తన బో

రంజిత... ఈపేరు విని చాలా రోజులైంది. కర్నాటకు చెందిన నిత్యానంద స్వామితో రాసలీలలు బయటకు వచ్చాక.. ఆమె పేరు బాగా పాపులర్‌ అయింది. ఆ తర్వాత స్వామిపై కేసులు వేయడం.. కోర్టు కేసు నుంచి బయటపడటం జరిగింది. బెంగుళూరు శివారల్లో విశాలమైన ఆశ్రమంలో నిత్యానంద.. తన బోధనలతో భక్తుల్ని మైమరిపించేవిధంగా చేసేవాడు. అందులో నటి రంజిత ఒకరు. 
 
ప్రస్తుతం ఆమె కీలకమైన వ్యక్తి. ప్రత్యేకత ఏమంటే... దసరా నాటికి తెలుగులో భక్తి చానల్‌ ప్రారంభం కాబోతుంది. నిత్యానంద ప్రవచనాలు, ఆయన్ను ప్రమోషన్‌ చేసేవిధంగా వుండే ఈ ఛానల్‌ను నిర్వహించబోయేది నూకారపు సూర్యప్రకాశరావు. ఓ డైలీ న్యూస్‌ పేపర్‌కు అధినేత అయిన ఈయన గతంలో రియల్‌ ఎస్టేట్స్‌ కుంభకోణంలో నిందితుడుగా.. అరెస్ట్‌ అయి బయటకు వచ్చారు.
 
నిత్యానంద భక్తుడైన ఆయన ఓ ఛానల్‌ను పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ఆశ్రమానికి వెళ్లి.. నటి రంజితతో చర్చలు జరిపారు. నిత్యానందకు పర్సనల్‌ సెక్రటరీ కాబట్టి.. ఆమె మొత్తం డిజైన్‌ చేసిందని విశ్వసనీయ సమాచారం. సో.. త్వరలో మరో భక్తి చానల్‌ రావడం.. దాని ద్వారా.. రంజిత మరింత పాపులర్‌ కావడం జరగబోతున్నదన్నమాట.