1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (09:31 IST)

నీ కొడుకు కావాలంటే నా పక్కలో పడుకో : మహిళపై అత్యాచారం...

తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఆమె బిడ్డను కిడ్నాప్ చేసి... ఆ మహిళపై ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి తెగబడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఆమె బిడ్డను కిడ్నాప్ చేసి... ఆ మహిళపై ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి తెగబడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ తన భర్తతో పాటు యేడాది వయస్సుగల కుమారుడితో కలిసి పుట్టింటికి బయలుదేరింది. మార్గమధ్యంలో భర్తకు ఫోన్ రావడంతో ఆమెను బస్టాప్ వద్ద బస్సు ఎక్కించి వెళ్లిపోయాడు. పుట్టింటికెళ్లిన ఆమెకు రాత్రి 9 గంటల సమయంలో భర్త ఫోన్‌ చేసి త్వరగా ఇంటికి రావాలని చెప్పాడు. దీంతో భర్త దగ్గరకు వెళ్లటానికి ఆమె మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద కుమారుడితో కలిసి నిలబడింది. 
 
బస్టాపులో ఒంటరిగా నిలబడివున్న బిడ్డతో ఉన్న మహిళను గుర్తించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు.. ఆమె వద్దకు వచ్చారు. వారిలో ఒకడు నా పేరు రాజు.. నీ భర్తకు స్నేహితులమని నమ్మించాడు. దీంతో ఆమెను బైక్‌ ఎక్కించుకుని.. డిపోచంపల్లి గ్రామ పరిధిలోగల కంబాలకుంట చెరువు కట్ట మీదకు తీసుకెళ్లారు. 
 
అక్కడ ఇద్దరూ కలిసి మందు తాగి ఆమె పర్సులో ఉన్న ఐదువేల రూపాయలు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. నీ కుమారుడు కావాలంటే మా కోరిక తీర్చాలని బెదిరించారు. ఆమెపై అత్యాచారం చేసి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న ఆమె భర్త సహకారంతో దుండిగల్‌ పోలీసులకు జరిగిన విషయంపై బుధవారం ఉదయం ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.