ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (20:34 IST)

విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న వారిపై కేసుల నమోదు

రెండు రోజుల క్రితం విశాఖపట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని అడ్డుకున్న ఘటనలో నిందితులపై కేసులు నమోదు అయ్యాయి.

చంద్రబాబు వాహనశ్రేణిపై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరిన వారిపై పోలీసులు కేసులు చేశారు. టీడీపీ నాయకులపైనా కేసులు నమోదయ్యాయి.

విశాఖలో చంద్రబాబు యాత్రను నిరసిస్తూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ వ్యక్తి జేటీ రామారావుపై, వైసీపీ నాయకురాలు ఎన్.కృపాజ్యోతిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జేటీ రామారావు, కృపాజ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.