బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (20:42 IST)

టీచర్ రాజేష్ శాడిస్టుగా ఎందుకు మారాడంటే...

తాను నపుంసకుడన్న సీక్రెట్‌ను బహిర్గతం చేసినందుకుగాను శోభనం రోజు రాత్రే కట్టుకున్న భార్యపై పిడిగుద్దులు కురిపించిన టీచర్ రాజేష్ ఉదంతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన పెను కలకలం రేప

తాను నపుంసకుడన్న సీక్రెట్‌ను బహిర్గతం చేసినందుకుగాను శోభనం రోజు రాత్రే కట్టుకున్న భార్యపై పిడిగుద్దులు కురిపించిన టీచర్ రాజేష్ ఉదంతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన పెను కలకలం రేపింది. 
 
చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే రాజేష్ అనే ఉపాధ్యాయుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా, తాను దాంపత్య జీవితానికి పనికిరారని తెలిసి కూడా కట్టుకున్న భార్యపై అతి కిరాతకంగా దాడి చేశాడు. 
 
దీనిపై ప్రముఖ సైకియాట్రిస్టులు స్పందిస్తూ, రాజేష్ సంఘటనను రెండు రకాలుగా చూడాలి. ఒకటి అతని ప్రవర్తన. ఆ రోజు రాత్రి ఏ విధంగా ప్రవర్తించాడు అన్నది సైక్లాజికల్ ఇష్యూ. రెండోది అతని నపుంసకత్వంలో మానసిక అంశాలు. 
 
పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ల వ్యక్తిత్వంలో లోపం ఉంటుంది. సైకోపతిక్ పర్సనాలిటీ, బోర్డర్ లైన్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్లు.. వాళ్లకు వాళ్లు అతిగా ప్రేమించుకుంటూ చిన్న విషయానికే ఎక్కువగా చెలరేగిపోవడం జరుగుతుంది. 
 
ఇలాంటి హింసా ప్రవృత్తి కలిగి ఉంటుంది. రాజేష్ కూడా ఆకోవకు చెందిన వ్యక్తి కావడం వల్లే ఇలా కిరాతకంగా ప్రవర్తించివుంటాడని చెపుతున్నారు.