శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (16:34 IST)

భారత దేశ చరిత్రలో ఇదొక రికార్డ్ అంటున్న స‌జ్జ‌ల‌

సీఎం జగన్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నార‌ని రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సజ్జల రామ కృష్ణా రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిషత్ ఎన్నికల ఫలితాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో 70శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయని, 98కి పైగా స్థానాలను వైసిపి గెలుచుకుంది అని చెప్పారు. భారత దేశ చరిత్రలో ఇదొక రికార్డ్ అని అభివర్ణించారు. 
 
చంద్రబాబు కుట్రలను ప్రజలు ఓట్లతో తిప్పి కొట్టారు అని సజ్జల రామ కృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు పరిషత్ ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం అని కొనియాడారు. కుప్పంలోనే టిడిపి బోర్లా పడింది అని ఎద్దేవా చేశారు. కుప్పం ఓటర్లు కూడా చంద్రబాబును విశ్వసించ లేదని అన్నారు. పదవుల్లో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి అని సూచించారు.  ప్రభుత్వంపై టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోంద‌ని సజ్జ‌ల  మండిపడ్డారు.