సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (23:29 IST)

కాజలో నిషేధిత గుట్కాలు పట్టివేత

తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి కాజ గ్రామంలో  ఓ కూల్ డ్రింక్స్ అండ్ కిరాణా షాప్ లో నిషేధిత గుట్కాల విక్రయం  చేస్తోన్నట్లు స్పెషల్ బ్రాంచి పోలీసులు  ఇచ్చిన సమాచారం మేరకు మంగళగిరి రూరల్  పోలీసులు రూ.5 వేల విలువైన నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని  అదుపులోకి తీసుకొన్నారు. 

మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాజ గ్రామంలోని జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పక్కనే అదే గ్రామానికి చెందిన కె. నాగమల్లేశ్వరరావు  మారుతీ కూల్ డ్రింక్స్ , కిరాణా షాప్ నిర్వహిస్తోన్నాడు. గత కొంతకాలంగా షాపులో  నిషేధిత గుట్కాలను విక్రయిస్తోన్నట్లు  రూరల్ ఎస్.బీ. పోలీసులకు సమాచారం అందింది.

దీంతో వారు రూరల్  ఎస్.ఐ. లోకేష్ లోకేష్ కు సమాచారం అందించగా ఆయన తన సీబ్బందితో మంగళవారం  నిషేధిత గుట్కాలు రహస్యంగా  విక్రయిస్తోన్న కూల్ డ్రింక్స్ అండ్ కిరాణా షాప్ పై  ఆకస్మిక  దాడిచేసి   రూ.5వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.