శేఖర్ రెడ్డి వెనుక తితిదే జెఈఓ శ్రీనివాసరాజు ఉన్నారా..?
శేఖర్ రెడ్డి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాందించి చర్చనీయాంశంగా మారిన శేఖర్ రెడ్డి అంటే చిన్నపిల్లాడు కూడా ప్రస్తుతం చెబుతాడు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లో కోట్ల రూపాయలు బయటపడి, చివరకు
శేఖర్ రెడ్డి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాందించి చర్చనీయాంశంగా మారిన శేఖర్ రెడ్డి అంటే చిన్నపిల్లాడు కూడా ప్రస్తుతం చెబుతాడు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లో కోట్ల రూపాయలు బయటపడి, చివరకు ఆ కేసును సిబీఐ, ఈడీలకు అప్పగించిన ఐటీ శాఖ అధికారులు ప్రస్తుతం ఆ కేసును లోతుగా విచారిస్తున్నారు. శేఖర్ రెడ్డి వెనుక ఎవరు ఉన్నారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఇప్పటికే శేఖర్ రెడ్డి వెనుక అన్నాడిఎంకేకు చెందిన ప్రముఖులు ఉన్నారన్న విషయం తెలిసిందే. అన్నాడిఎంకే పార్టీలో సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం ఇప్పటికే విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మరోవైపు శేఖర్ రెడ్డి వెనుక తితిదే జెఈఓ శ్రీనివాస రాజు కూడా ఉన్నట్లు విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. తితిదే పాలకమండలి సభ్యుడిగా శేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి తిరుమల జెఈఓతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. పాలకమండలి సభ్యుడు కాక ముందు నుంచి కూడా శ్రీనివాసరాజుతో శేఖర్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. చెన్నైలో ఇద్దరు కలిసి కొన్ని కంపెనీలను కూడా నడుపుతున్నట్లు తెలుస్తోంది. పలు హోటళ్లతో పాటు, కళాశాలలను కూడా ఇద్దరు కలిసి చేస్తున్నట్లు సమాచారం. అయితే శ్రీనివాసరాజు తన పేరు మీద బిజినెస్‌లు చేయకుండా కొంతమంది బినాల పేర్లతో ఈ తతంగం మొత్తం నడిపిస్తున్నట్లు సమాచారం.
శేఖర్ రెడ్డి, శ్రీనివాసరాజులకు మధ్య సన్నిహిత సంబంధాలు గత కొన్నిసంవత్సరాలుగా నడుస్తోంది. అయితే ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న కొన్ని ముఖ్యమైన ఫైళ్లలో వీరిద్దరికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ఫైళ్లకు సంబంధించి విచారణ జరిగిన తరువాత సిబీఐ, ఈడీ అధికారులు ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.