శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (09:26 IST)

హైదరాబాద్ స్టార్ హోటల్‌లో సెక్స్ రాకెట్.. ముంబై మోడల్ అరెస్టు...

హైదరాబాద్‌లోని పేరుమోసిన నక్షత్ర హోటల్‌లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇందులో ముంబై మోడల్‌తో పాటు సెక్స్ రాకెట్ నిర్వాహకులు, ఇద్దరు విటులను కూడా పోలీస

హైదరాబాద్‌లోని పేరుమోసిన నక్షత్ర హోటల్‌లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇందులో ముంబై మోడల్‌తో పాటు సెక్స్ రాకెట్ నిర్వాహకులు, ఇద్దరు విటులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. నగరానికి చెందిన నాగరాజు, తిరుమలరావు అనే ఇద్దరు వ్యక్తులు ఇటీవల ముంబైకు వెళ్లారు. అక్కడ ఓ మోడల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ మోడల్‌ను ఈనెల 10వ తేదీన నగరానికి తీసుకువచ్చారు. 
 
ఆ మోడల్ వివరాలను అన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన పలువురు బడాబాబుల కుమారులు... ఆ మోడల్‌తో ఎంజాయ్ చేసేందుకు సమ్మతించారు. వారి కోరిక మేరకు అమీర్ పేటలోని పేరు మోసిన నక్షత్ర హోటల్‌లో ఓ రూమ్ బుక్ చేసుకున్నారు. ఈ హోటల్ గదిలో గత మూడు రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ వచ్చారు.
 
ఈ క్రమంలో ఈ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్న పక్కా సమాచారం అందుకున్న పశ్చిమ మండలం పోలీసులు హోటల్‌లో బుధవారం రాత్రి ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్ హోటల్‌లోని గది నంబరు 308లో ఓ మోడల్, ఇద్దరు విటులు కలిసివుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
అలాగే, ఈ సెక్స్ రాకెట్‌ సూత్రధారులైన ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. విటులు బడాబాబులు కుమారులు కావడంతో వారిని పోలీసులు వదిలి వేశారు. మోడల్‌ను రెస్క్యూ హోంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.