మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2016 (11:45 IST)

చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల కంటే పాములే ఎక్కువ ఉన్నాయి!

జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందే రోగుల కంటే పాములు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట ఆసుపత్రి మెడికల్‌వార్డులోని ఓ గదిలో 14 పాముపిల్లలు, మొన్న మరో రెండు పిల్లలన

జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందే రోగుల కంటే పాములు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట ఆసుపత్రి మెడికల్‌వార్డులోని ఓ గదిలో 14 పాముపిల్లలు, మొన్న మరో రెండు పిల్లలను వైద్య సిబ్బంది చంపి వేశారు. శనివారం ఉదయం ఇదే వార్డులోని మరుగుదొడ్డి నుంచి రెండు పాములు రావడం వైద్య సిబ్బంది గుర్తించారు. దీంతో ఇటు రోగులు, అటు వైద్య సిబ్బంది హడలెత్తిపోతున్నారు.
 
రోగులు ఎక్కడబడితే అక్కడ తినుబండారాలను వేస్తుంటారు. దీంతో ఎలుకలు, పందికుక్కలు రావడంతో వీటిని తినడానికి పాముల సంచారం పెరిగింది. మెడికల్‌ వార్డులోని నర్సుల గదిలోని మరుగుదొడ్డి కిందిభాగంలో ఇందుకు రంధ్రం ఏర్పాటు చేసుకున్నాయి. చంపిన ఎలుకలను కొంతకాలంగా పాములు మరుగుదొడ్డి కిందిభాగానికి తీసుకెళ్తున్నా యి. ఇటీవల గుడ్లు పెట్టడంతో పాముపిల్లలు బయటకు రావడంపై ఆందోళన నెలకొంది.