శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 10 నవంబరు 2016 (11:25 IST)

పెద్ద నోట్ల రద్దు.. జేబు దొంగలకు కష్టాలు.. వందనోట్లు పెట్టుకోవడం తెలీదా? అంటూ పర్సు విసిరేశారు..

పెద్ద నోట్ల రద్దుతో జేబు దొంగలకు కష్టాలు తప్పలేదు. పర్సు కొట్టేసిన దొంగలు అందులో రూ.500 నోట్లు ఉండటంతో తిరిగిచ్చేశారు. మంగళవారం రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి మోడీ ప్రకటించిన తర్వాత గ

పెద్ద నోట్ల రద్దుతో జేబు దొంగలకు కష్టాలు తప్పలేదు. పర్సు కొట్టేసిన దొంగలు అందులో రూ.500 నోట్లు ఉండటంతో తిరిగిచ్చేశారు. మంగళవారం రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి మోడీ ప్రకటించిన తర్వాత గ్రేటర్ నోయిడాలో ఓ పర్సు దొంగతనం జరిగింది. ఓ వ్యక్తి జేబులోని పర్సును కొట్టేసిన దొంగలు అందులోని రూ.500 నోట్లను చూసి కంగుతిన్నారు. దొంగతనానికి గురైన ఆ వ్యక్తి  పేరు వికాశ్ కుమార్. 
 
సెక్టార్ ఐషర్ నివాసి. గ్రేటర్‌ నోయిడాలో మంగళవారం రాత్రి పని పూర్తిచేసుకుని రాత్రి 11 గంటలప్పుడు తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు పర్సును కొట్టేశారు. అందులో మూడు రూ.500 నోట్లు ఉన్నాయి. బస్టాండ్‌కు చేరుకుంటుండగా పర్సు చోరీకి గురైందన్న విషయాన్ని గుర్తించాడు. 
 
పోలీసుల సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగానే దొంగలు అతని దగ్గరకే వచ్చారు. వికాష్ వంక కోపంతో చూస్తూ పర్సు విసిరేశారు. ‘అందులో వందనోట్లు పెట్టుకోవడం తెలీదా?’ అని అరుస్తూ చెంపపై కొట్టి వెళ్లిపోయారు’’ అని వికాశ్ తెలిపాడు