సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:31 IST)

తెలుగు రాష్ట్రాలకు డిగ్గీరాజా పీడవిరగడైంది... తెలంగాణ ఇన్‌చార్జ్‌గా కుంతియా

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీరాజా జాడ ఇక తెలుగు రాష్ట్రాల్లో కనిపించదు. రాష్ట్ర విభజన పుణ్యమాని సీమాంధ్రలో అడుగుపెట్టలేని డిగ్గీరాజా.. ఇ

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీరాజా జాడ ఇక తెలుగు రాష్ట్రాల్లో కనిపించదు. రాష్ట్ర విభజన పుణ్యమాని సీమాంధ్రలో అడుగుపెట్టలేని డిగ్గీరాజా.. ఇకపై తెలంగాణ రాష్ట్ర గడ్డపై కూడా పాదం మోపలేని పరిస్థితి ఏర్పడింది. 
 
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా డిగ్గీరాజా కొనసాగుతున్నారు. ఈ పదవి నుంచి ఆయనను తొలగిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు. అదేసమయంలో ఇకపై తెలంగాణ పార్టీ బాధ్యతలను కుంతియా పర్యవేక్షిస్తారని ఆ పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
కాగా, గత కొంతకాలంగా దిగ్విజయ్ వ్యవహారాలపై టీఎస్ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన విఫలమవుతున్నారన్న ఆరోపణలూ వచ్చిన నేపథ్యంలోనే ఈ మార్పు జరిగినట్టు సమాచారం. ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి డిగ్గీని తొలగించడంతో పలువురు టీ కాంగ్రెస్ నేతలు లోలోప సంతోష పడుతున్నారు.