శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2016 (09:15 IST)

ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లే.. అలెర్టయిన చంద్రబాబు... ఎలా?

ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లుగానే కనిపిస్తోంది. భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమైపోయింది. దీంతో ఏపీకి ప్యాకేజీపై కేంద్రం క

ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లుగానే కనిపిస్తోంది. భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమైపోయింది. దీంతో ఏపీకి ప్యాకేజీపై కేంద్రం కసరత్తు కొలిక్కివచ్చింది. అంతేగాకుండా బుధవారం సాయంత్రం ఏపీకి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
హోదాతో సరితూగే ప్రయోజనాలన్నీ కలగలిపి ప్యాకేజీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రాజెక్టులకు నిధులు, రాజధాని నిర్మాణంపై కేంద్రం స్పష్టంగా చెప్పబోతోంది. పోలవరానికి 100శాతం నిధులపై తన బాధ్యతేనని కేంద్రం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. 
 
పారిశ్రామిక రాయితీలతో పాటు రాజధానికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీపై.. కేంద్రం స్పష్టమైన భరోసా ఇవ్వనుంది. ప్రత్యేక హోదా నిధులు, సాధారణ నిధుల మధ్య ఉన్న.. 30 శాతం తేడాను ప్యాకేజీలో కేంద్రం కలపనుంది. రాజధానికి భారీ మొత్తాన్ని ప్యాకేజీగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 
 
ఇదిలావుంటే.. ఏపీకి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఏపీ మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేశారు. కేంద్రం ప్యాకేజీని ప్రకటించిన తర్వాతనే మంత్రులు బహిరంగ వ్యాఖ్యలు చేయాలని, అప్పటి వరకు మౌనంగా ఉండాలని చంద్రబాబు మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. 
 
ఇంకా త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుతో పాటు మొత్తం నాలుగు బిల్లులు ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.