గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (08:33 IST)

అక్టోబరు 6 నుండి తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పవిత్రోత్సవాలు

తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో అక్టోబరు 6 నుండి 8వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం అక్టోబరు 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో పవిత్రోత్సవాలు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.
 
యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల  తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
 
పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 6న పవిత్రప్రతిష్ఠ, స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రెండో రోజు అక్టోబరు 7న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు.

చివరిరోజు అక్టోబరు 8న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, స్నపనతిరుమంజనం, చ‌క్ర‌స్నానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. అదేరోజు సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మ‌వార్ల‌ను ఆల‌యంలో ఏకాంతంగా ఊరేగిస్తారు.