ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (19:46 IST)

ఒత్తిడితోనే బలవన్మరణం.. కోడెల కుమార్తె

తన తండ్రి వివిధ ఒత్తిడిలను తట్టుకోలేకే బలవన్మరణం పొందినట్టు ఆయన కుమార్తె విజయలక్షీ వెల్లడించారు.. ఈ మేరకు ఆమె పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు.

ఆమె నివాసంలోనే కోడెల ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరించారు..తన తండ్రి చాలా ఒత్తిడిలో ఉన్నారని, తన తండ్రి మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని చెప్పారు.

ఈరోజు ఉదయం తమ ఇంట్లో కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు కోడెల వెళ్లారని, అరగంట సమయం దాటినా ఆయన కిందకు రాకపోయేసరికి తనకు అనుమానం వచ్చిందని, పైకి వెళ్లి చూసే సరికి తన తండ్రి ఆత్మహత్యకు చేసుకుని ఉండటం తాను గమనించినట్టు చెప్పారు.

గన్ మ్యాన్, డ్రైవర్ సాయంతో తన తండ్రిని ఆసుపత్రికి తరలించామని పోలీసులకు ఆమె వివరాలు అందించారు.