ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (12:27 IST)

ఏపీలో పీఆర్సీ వార్‌: సమ్మెకు సంపూర్ణ మద్దతు

ఏపీలో పీఆర్సీ వార్‌ మొదలైంది. కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది.
 
ఇప్పటికే ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులతో పాటు అత్యవసర సేవల విభాగాలు సమ్మెలో భాగస్వామ్యం అవుతామని తెలిపారు. 
 
మరోవైపు ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నామని.. ఇక మీదట ఎదురుచూపులు ఉండబోవని మంత్రుల కమిటీ ప్రకటించింది. 
 
ఒకవేళ ఉద్యోగ సంఘాలే తమను పిలిస్తే చర్చలకు వెళ్తామని వెల్లడించారు. అయితే జీవోలు రద్దు చేసే వరకు చర్చలు జరిపేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.