ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (17:31 IST)

పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాలు తగ్గేదేలే!

పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాలు తగ్గేదేలే అంటున్నాయి. తాజాగా పీఆర్సీ సాధన సమితి పిలుపుమేరకు సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా నిర్ణయించడంతో కీలకంగా మారింది.
 
ప్రభుత్వంలో విలీనం ఎందుకు తీసుకున్నామా అని ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నిర్ణయం ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. 
 
పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలకపాత్ర వహిస్తారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
 
ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ చేపట్టబోయే అన్ని రకాల ఆందోళనకు పూర్తిగా మద్దతిస్తున్నాం అని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తెలిపాయి.