ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (20:08 IST)

పీఆర్సీపై చర్చలకు సిద్ధం.. సజ్జల రామకృష్ణారెడ్డి

పీఆర్సీ విషయంలో వున్న అపోహలు తొలగించేందుకు ఉద్యోగులతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా వున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 
 
అవసరమైతే ఓ నాలుగు మెట్లు దిగడానికైనా సిద్ధమన్నారు. చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయని, పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 
 
రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామని, పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్ధమేనని ఆయన వెల్లడించారు.
 
బాధ్యత కలిగిన నేతలు ఇమ్మెచ్యూర్‌గా వ్యవహరించడం మంచిది కాదని ఉద్యోగులు మా ప్రత్యర్థులో.. శత్రువులో కాదు.. ప్రభుత్వంలో భాగమేనని  సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అగ్నికి ఆజ్యం పోసే అంశాలపై మేం మాట్లాడమై ఆయన తెలిపారు. 
 
పే స్లిప్పులు వస్తే ఎంత పెరిగిందో, ఎవరికి తగ్గిందో స్పష్టంగా తెలుస్తుందని, సీఎం జగన్ పాజిటీవ్‌గా ఉండే వ్యక్తే. చర్చలకు వెళ్లాల్సిందిగా నేతలకు ఉద్యోగులూ చెప్పాలి. ఉద్యోగుల లేఖ ఇచ్చిన రోజే ఈ నెల 27వ తేదీన మరోసారి చర్చిద్దామని చెప్పాం.. కానీ చర్చలకు వారే రాలేదన్నారు.