శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 25 డిశెంబరు 2021 (14:29 IST)

నోవోటెల్ లో భారత ప్రధాన న్యాయమూర్తి క్రిస్మస్ వేడుకలు

మూడు రోజుల ప‌ర్య‌ట‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చేరిన జ‌స్టిస్ ఎన్.వి.ర‌మ‌ణ విజ‌య‌వాడ నోవాటెల్ లో బ‌స చేశారు. ఈ ఉద‌యం నోవాటెల్ హోటల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు పాల్గొన్నారు. 
 
క్రిస్మస్ సందర్బంగా క్రిస్మస్ కేకును  జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు కట్ చేసారు. ఈ సందర్బంగా జస్టిస్ వెంకటరమణ మాట్లాడుతూ, క్రిస్టమస్ పండుగ శాంతి సౌబ్రాతృత్వాలకు ప్రతీక అన్నారు. ఏసు అందించిన శాంతి సందేశాన్ని అంద‌రూ పాటించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, జెడ్పి సీఈఓ, ఫాస్టర్లు, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ప్రభృతులు పాల్గొన్నారు.