సొంత ఊరు పొన్నవరంలో ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు బ్రహ్మరథం
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎద్దల బండిపై గ్రామీణ వాతావరణంలో సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం చేరుకుననారు. జస్టిస్ ఎన్వీ రమణకు గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు. ఎన్వీ రమణ పై పూలవర్షం కురిిపిస్తూ, తమ అభిమానాన్ని చాటుకుంటూ, సాదర స్వాగతం అందించారు. ఎడ్లబండి పై ఊరేగింపుతో, మేళా తాళాలతో, కోలాటం నృత్యాలతో జస్టిస్ ఎన్వీ రమణను గ్రామస్థులు తోడ్కొని గ్రామంలోకి తీసుకు వెళ్ళారు.
జస్టిస్ రమణ ఊరేగింపుకు ముందు నిలిచిన అలంకృతమైన అశ్వాలు అందరికీ కనువిందు చేశాయి. తమ గ్రామం బిడ్డ రమణ దేశానికే తలమానికమైన సుప్రీం కోర్టు సీజె కావడం తమకు గర్వకారణమని గ్రామస్తులు తెలిపారు.