గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (21:21 IST)

పట్టాభికి బెయిల్ మంజూరు..

Pattabhi
ఏపీ సీఎం జగన్‌ను దూషించిన కేసులో అరెస్టయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభి బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న పిమ్మట పట్టాభికి బెయిల్ ఇస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. పట్టాభి ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు.
 
సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొన్నిరోజుల కిందట పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలోనే ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.