ఢిల్లీకి పయనం.. ముఖ్యనేతలతో చంద్రబాబు భేటి
ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఢిల్లీ బాట పట్టనున్నారు. అక్కడ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడే జరిగే భేటీలో రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఢిల్లీ పర్యటన అజెండాపై చంద్రబాబు.. శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌తోపాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.
ఢిల్లీ పర్యటన అజెండాపై నేతలతో చంద్రబాబు చర్చించారు. ఈ నెల 25న రాష్ట్రపతితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు చేయాలని కోరనున్నారు. అయితే ఢిల్లీ పర్యటన సమయంలో అనుసరించాల్సిన అజెండాపై పార్టీ ముఖ్యనేతలు సూచనలను చంద్రబాబు తెలుసుకున్నారు.
సోమవారం రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు, నేతలు.. రాష్ట్రపతితో పాటు ఇంకా ఎవరెవరిని కలవాలి అనే దానిపై నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నేతల బృందానికి సోమవారం 12.30 రాష్ట్రపతి భవన్ సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో 18 మంది టీడీపీ నేతలు వెళ్లనున్నట్లు సమాచారం.