బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (15:50 IST)

నేడు గవర్నర్‌ తో టిడిపి నేతల భేటీ

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ను కలిసేందుకు టిడిపి నేతలకు అనుమతి లభించింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌ లో గవర్నర్‌ ను టిడిపి నేతల బృందం కలవనుంది.

నిన్న తిరుపతిలో చంద్రబాబు సభ వద్ద జరిగిన ఘటన విషయాన్ని గవర్నర్‌ దృష్టికి టిడిపి నేతలు తీసుకెళ్లనున్నారు. నిన్న తిరుపతిలో టిడిపి తరపున ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు.

సోమవారం రాత్రి కూడా చంద్రబాబు ప్రచారంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఓ మహిళ, యువకుడికి గాయాలయ్యాయి.

దీంతో చంద్రబాబు వెంటనే వాహనంపై నుండి కిందకు దిగి రహదారిపైనే బైటాయించి నిరసన తెలిపారు. సభకు పోలీసులు సరిగ్గా రక్షణ కల్పించలేదని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.