గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (10:12 IST)

తుగ్లక్‌పాలనకు తెరతీస్తే ఊరుకోం.. ప్రధాని మోడీకి టీడీపీ ఎమ్మెల్యే బొండా వార్నింగ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ఘాటైన విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ఘాటైన విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 
 
కేంద్రం బంగారు నగలపై పరిమితి విధిస్తూ సరికొత్త ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో మహిళల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లైన మహిళలకు 500 గ్రాములు, పెళ్లికాని యువతికి 250 గ్రాములు.. పురుషుడికి 100 గ్రాముల బంగారం వరకే అనుమతిస్తామని కేంద్రం తాజాగా నిబంధనలు విధించింది.
 
పరిమితికి మించి బంగారం ఉంటే లెక్కలు చూపాల్సిందేనని.. వారసత్వ బంగారం, వ్యవసాయ ఆదాయంతో కొన్న బంగారం ఎంతైనా ఉండొచ్చని.. అయితే, లెక్కచెప్పిన బంగారానికి పరిమితి లేదని శుక్రవారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
 
దీనిపై ఆయన స్పందిస్తూ.. బంగారంపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించడంపై మండిపడ్డారు. కేంద్రం అత్యుత్సాహానికి పోయి మహిళల బంగారం జోలికి వస్తే వారి ఆగ్రహానికి గురికావాల్సివస్తుందన్నారు. తాత, ముత్తాతల కాలం నుంచి లెక్కలు అడిగి మోడీ సర్కారు తుగ్లక్‌ పాలనకు తెరతీస్తే ఊరుకునేందిలేదన్నారు.