మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (17:09 IST)

వైకాపా నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తారు : బుద్ధా వెంకన్న ఆరోపణ

కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తారంటూ పేర్కొన్నారు. వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఎమ్

కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తారంటూ పేర్కొన్నారు. వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు కట్టబెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు.
 
దీనికి బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, ఆ తర్వాత బీజేపీలో చేరడం పార్టీ ఫిరాయింపు కిందికి రాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
 
పార్టీ ఫిరాయింపులపై పురంధేశ్వరి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ అవినీతి, జగన్ సూట్ కేసు కంపెనీలపై ఏనాడైనా ప్రశ్నించారా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మీరు వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీ అయిన వైఎస్సార్సీపీలో చేరి పోటీ చేస్తారని తెలిపారు.