బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 19 అక్టోబరు 2021 (14:48 IST)

టిడిపి బలోపేతానికి వ్యూహ రచన! కొండ‌ప‌ల్లి మ‌హిళ‌ల‌కు చోటు!!

మైలవరం నియోజకవర్గ టిడిపి మహిళా నేతలకు అదనపు భాద్యతలు అప్పగించారు పార్టీ  అధి నాయకుడు చంద్ర‌బాబు నాయుడు. కొండపల్లి మున్సిపాలిటీ క్రియాశీల మహిళా నేతలకు విజయవాడ పార్లమెంట్ టిడిపి మహిళా కమిటీలో చోటు క‌ల్పించారు. 
 
ప్రత్యక్ష రాజకీయాలలో ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ అయినా మహిళలకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజా ప్రతినిధులుగా, ఎలక్షన్ లో అభ్యర్థులుగా, నామినేటెడ్ పదవులకు సైతం మహిళలకే అగ్ర తాంబూలం ఇస్తున్నారు. ఇదే తరహాలో మైలవరం టిడిపి సైతం పార్టీ బలోపేతానికి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.
 
మైలవరం నియోజకవర్గ పరిధిలోని మహిళా నేతలకు విజయవాడ పార్లమెంట్ టిడిపి మహిళా కమిటీలో సముచిత స్థానం కల్పించారు. ఇక కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ విమర్శలు ఎగ్గుపెడుతున్న తెలుగు మహిళా నేతలకు కూడా విజయవాడ పార్లమెంట్ మహిళా కమిటీలో చోటు కల్పించారు. వారిలో ధరణికోట విజయలక్ష్మి, మల్లెల పార్వతి, జేటిపిటి దుర్గా మహాలక్ష్మి కొండపల్లి మున్సిపాలిటీ టిడిపి లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరికి అదనపు బాధ్య‌తలు అప్పగించి కొండపల్లి మున్సిపాలిటీ లో టిడిపి బలోపేతానికి వ్యూహ రచన చేస్తున్నారు.