బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 మార్చి 2017 (11:27 IST)

గాయనిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన జానపద గాయకుడు... మూడు సార్లు అబార్షన్ కూడా..

హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ జానపద గాయకుడు.. ఓ గాయనికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని అత్యాచారం చేశారు. అలా మూడుసార్లు గర్భవతిని చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.

హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ జానపద గాయకుడు.. ఓ గాయనికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని అత్యాచారం చేశారు. అలా మూడుసార్లు గర్భవతిని చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఎద్దుల జంగారెడ్డి అనే జానపద గాయకుడు హైదరాబాద్‌లో నివశిస్తున్నాడు. ఈయన రెడ్డి బృందం పేరుతో మ్యూజికల్ ట్రూప్‌ను నిర్వహిస్తున్నాడు. ఈయనపై 27 యేళ్ల వయసున్న ఓ గాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన జంగారెడ్డి.. పలుమార్లు అత్యాచారం చేసినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో తనకు మూడు సార్లు అబార్షన్ చేయించినట్టు ఆమె హైదరాబాద్ గాంధీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.