ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

తమిళనాడును పగబట్టిన బీజేపీ... అన్నాడీఎంకేలో చేలికే మోడీ లక్ష్యం : విజయశాంతి

తమిళనాడు రాష్ట్రంపై బీజేపీ పగబట్టిందని మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఆరోపించింది. ముఖ్యంగా.. అధికార అన్నాడీఎంకేలో చీలిక తెచ్చి ఆ రాష్ట్రాన్ని శాసించాలని ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. అందులో భాగంగాన

తమిళనాడు రాష్ట్రంపై బీజేపీ పగబట్టిందని మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఆరోపించింది. ముఖ్యంగా.. అధికార అన్నాడీఎంకేలో చీలిక తెచ్చి ఆ రాష్ట్రాన్ని శాసించాలని ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. అందులో భాగంగానే ఐటీ దాడులు చేయిస్తోందని ఆమె ఆరోపించారు. 
 
ఆర్కే నగర్ నియోజకవర్గ ఉపఎన్నికను రద్దుపై విజయశాంతి స్పందించారు. అన్నాడీఎంకేను బీజేపీ టార్గెట్ చేసిందని, మిగతా పార్టీలను పక్కనబెట్టిందని, ఏఐఏడీఎంకేలో చీలిక తేవడమే లక్ష్యంగా పావులు కదుపుతోందన్నారు. 
 
ముఖ్యంగా, బీజేపీ పాలనేతర రాష్ట్రాల్లో కమలనాథులు తలదూరుస్తున్నారని, ఎక్కడ బలహీనంగా కనిపించినా, అక్కడ చొచ్చుకుపోయేందుకు తనవంతు ప్రయత్నాలు సాగిస్తోందని ఆరోపించారు. జయలలిత చనిపోయిన తర్వాత కుట్రలకు పాల్పడుతోందని, వాస్తవానికి అన్నాడీఎంకేలో చీలిక లేదని, అందరూ ఐకమత్యంగా ఉన్నారని తెలిపారు.