బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 9 జూన్ 2017 (19:45 IST)

అభివృద్ధిపథంలో తెలుగు రాష్ట్రాలు... తెలంగాణా మంత్రి ఈటేల రాజేందర్

అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలులు అభివృద్ధి పథంలో అగ్రగ్రామిగా నిలిచాయని తెలంగాణ మంత్రి ఈటెల రజేందర్ అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయం 4th బ్లాక్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ శుక్రవారం

అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలులు అభివృద్ధి పథంలో అగ్రగ్రామిగా నిలిచాయని తెలంగాణ మంత్రి ఈటెల రజేందర్ అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయం 4th బ్లాక్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ శుక్రవారం నాడు కలిసి తన కుమారుడి వివాహానికి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మంత్రి పుల్లారావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత దేశంలోనే అనేక రంగాలలో అగ్రగామిగా నిలిచాయన్నారు. 
 
విడిపోయిన నాటికి ఉన్న బడ్జెట్ రూ. లక్షా 65 వేల కోట్లని, రెండు రాష్ట్రాలు కలిపి 3 లక్షల కోట్లు పైచిలుకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాయన్నారు. ఇంత పెద్దమొత్తంలో బడ్జెట్ పెట్టిన రాష్ట్రాలు దేశంలో మరేవీ లేవన్నారు. అనేక రంగాలలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాల కంటే కూడా ఆర్థిక ప్రగతిలో ముందు భాగంలో నిలిచామన్నారు. విభజన జరిగాక రెండు రాష్ట్రాలూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయనే భావన దేశ నాయకులలో ఉందన్నారు. 
 
తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ప్రజలలో ఉన్న భావన ఇప్పుడు పటాపంచాలయ్యాయన్నారు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు మూడేళ్లలో ఎంతో ప్రగతిని సాధించాయన్నారు. రాబోయే కాలంలో మరింత ప్రగతిని సాధిస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. జీఎస్టీ విషయంలో ఇప్పటికే ఆర్థికమంత్రులిద్దరం అనేక విషయాల్లో సామరస్యంగా చర్చించుకున్నాం. ప్రజల ప్రయోజనాల విషయంలో, ముఖ్యంగా అణగారిన వర్గాలకు, పేద ప్రజలకు జీఎస్టీలో నష్టం జరగకూడదనే విషయంలో ఇద్దరం ఏకాభిప్రాయంతో గత మూడు సంవత్సరాలుగా చర్చించుకుంటున్నాము. 
 
11వ తారీఖున జరిగే చివరి సమావేశంలో కూడా సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఉండే పద్ధతిలో ఒకే ఆలోచనతో ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తామని మంత్రి ఈటేల అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏరువాక పున్నమి దిగ్విజయంగా జరుగుతుందని, కంప్యూటర్ యుగం వచ్చినా, రాకెట్ యుగం వచ్చినా అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి, వ్యవసాయం మాత్రమే అని నమ్మే రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలన్నారు. 
 
రైతాంగానికి మంచి వర్షాలు పడి, పాడిపంటలతో కళకళాడాలని మనస్పూర్తిగా కోరారు. రాజధాని ప్రాంతం డెల్టా ప్రాంతం అవ్వడంతో ఎప్పుడూ పండే పంటలు, సిరి సంపదలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మూడు సంవత్సరాల కాలంలో కనీవినీ ఎరగని రీతిలో అద్భుతంగా రాజధానిగా రూపుదిద్దుకుంటుంది. ఈ దేశంలో నూతనంగా ఏర్పాడ్డ రాష్ట్రాలలో ఉత్పన్నమైనటువంటి పరిస్థితులతో పోలిస్తే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమస్య చాలా చిన్నదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు సమన్వయంతో కలిసిమెలిసి ఉంటున్నాయన్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా ఇలానే కలిసి ఉంటామన్నారు.