సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 6 జులై 2021 (13:58 IST)

కాన్వాయ్‌తో వెళ్తున్న ఎంపీ ఆగి, క్ష‌త‌గాత్రుడిని ఆసుప‌త్రికి...

గుంటూరు జిల్లా బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. సోమ‌వారం అర్ధ‌రాత్రి నవులూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఎంపీ సురేష్ కాన్వాయితో ర‌హ‌దారిపై తిరిగివెళుతున్నారు.

తన స్వగ్రామం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం బయలుదేరారు. మార్గ‌మ‌ధ్యమంలో వెంకటపాలెం ఎన్.సీ.సీ రహదారిపై ఓ బైక్ యాక్సిడెంట్‌ను గ‌మ‌నించారు. వెంట‌నే ఎంపీ సురేష్ తన కాన్వాయ్‌ను నిలిపేసి, క్షతగాత్రుని దగ్గరికి వెళ్లి పరామర్శించారు. ప్ర‌మాదం జరిగిన తీరును తెలుసుకుని త‌క్ష‌ణం స్పందించారు.

ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలైన క్షతగాత్రుడిని తన వెంట వచ్చిన పోలీస్ కాన్వాయ్‌లో ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్య చికిత్సకు వేగంగా ప్రభుత్వ ఆసుపత్రికి పంప‌డంతో క్ష‌త‌గాత్రుడినిక ప్రాణ గండం త‌ప్పింది. అత‌నికి మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ సురేష్ వైద్యులను కోరారు.