మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (14:16 IST)

గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి.. ఒకే కుటుంబం..?

గోదావరిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. భద్రాచలంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నానాలు చేసేందుకు ఐదుగురు గోదావరిలోకి దిగగా.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.

ఇందులో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరిని స్థానికులు రక్షించి, హాస్పిటల్‌కు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. 
 
మరో ఇద్దరు మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు, బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా సమాచారం. అయితే, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.